Irumudi: అయ్యప్ప భక్తులకు పూనకాలే.. ఇరుముడి మూవీలో ‘విల్లాలి వీరుడు’ సాంగ్‌.. క్లారిటీ ఇచ్చిన జీవీ ప్రకాష్

ఇరుముడి (Irumudi)సినిమాలో విల్లాలి వీరుడు సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన జీవీ ప్రకాష్ కుమార్.

GV Prakash Kumar confirmed that Villali Veerudu song will be in raviteja Irumudi movie

  • ఇరుముడిలో విల్లాడి వీరుడు పాట.
  • జీవీ ప్రకాష్ అధికారిక ధృవీకరణ.
  • అయ్యప్ప మాల నేపథ్యంలో సినిమా.

Irumudi: మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి(Irumudi)’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అయ్యప్ప మాల, ఆధ్యాత్మికత, బలమైన ఎమోషనల్ కంటెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రవితేజ కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన ప్రయత్నం కావడంతో, ఆయనను సరికొత్త కోణంలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Sahithi Dasari: సాహితీ దాసరి గ్లామర్ విందు.. స్టన్నింగ్ ఫోటోలతో నెట్టింట మంటలు

అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన ‘విల్లాడి వీరుడు ఎక్కినాడు పల్లకి.. వీర మణికంఠుడు ఎక్కినాడు పల్లకి’ అనే పాట ఈ సినిమాలో ఉంటుందా లేదా అనే విషయంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ సాంగ్ సినిమాలోని ప్రధాన ఘట్టాలకు ప్రాణం పోస్తుందని, ఒకవేళ ఉంటే సినిమా రేంజ్ మారుతుందని సినీ వర్గాలు భావించాయి. రవితేజ ఎనర్జీకి తోడు ఈ పవర్‌ఫుల్ భక్తి గీతం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని అంతా భావించారు.

తాజాగా ఈ ఉత్కంఠకు తెరదించుతూ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సదరు ఫేమస్ అయ్యప్ప సాంగ్ ఉంటుందని ఆయన అధికారికంగా ధృవీకరించారు. దీంతో రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవీ ప్రకాష్ తనదైన శైలిలో ఈ పాటను రీమిక్స్ లేదా రీక్రియేట్ చేయబోతున్నారని సమాచారం. ఈ ప్రకటనతో ‘ఇరుముడి’ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.