Hansika marriage : వాళ్ళు సెలెబ్రెటీస్ కాదు.. కానీ హన్సిక పెళ్ళికి ముఖ్య అథిలుగా వెళ్తున్నారు.. ఎవరో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఫేమ్ ని సంపాదించుకున్న నటి 'హాసిక'. ఇక ఇటీవలే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది ఈ ఆపిల్ బ్యూటీ. తన స్నేహితుడు మరియు బిజినెస్ పార్టనర్ అయిన సోహెల్ నే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. రాజస్థాన్ లోని జైపూర్ ముండోటా ప్యాలెస్‌లో జరుగుతున్నా ఈ వేడుకకు అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, స్నేహితుల మాత్రమే హాజరవుతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు...
- gum 95921
- Published On : December 4, 2022 / 09:31 PM IST
Hansika marriage special guests are poor children
Hansika marriage : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఫేమ్ ని సంపాదించుకున్న నటి ‘హాసిక’. ఇక ఇటీవలే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది ఈ ఆపిల్ బ్యూటీ. తన స్నేహితుడు మరియు బిజినెస్ పార్టనర్ అయిన సోహెల్ నే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈఫిల్ టవర్ వద్ద సోహెల్ మ్యారేజ్ ప్రొపోజల్ ని అంగీకరించిన ఈ భామ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు తను చేసుకోబోయే వరుడిని పరిచయం చేసింది.
Hansika marriage : నేడే హన్సిక పెళ్లి.. సంగీత్ లో డ్యాన్స్ తో రచ్చ చేసిందిగా..
కాగా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరుగుతన్న హన్సిక వివాహం.. రాజస్థాన్ లోని జైపూర్ ముండోటా ప్యాలెస్‌లో జరగనుంది. దీంతో ఈ వేడుకకు అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, స్నేహితుల మాత్రమే హాజరవుతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కొందరు స్పెషల్ గెస్ట్ లు హాజరుకానున్నారు. అయితే వారెవ్వరు సెలబ్రిటీస్ కాదు, ఆ అతిధులు అంతా నిరుపేద చిన్నారులు.
హన్సిక సినిమాల్లో నటించి తన నటనతో అందర్నీ ఆనందపరచడమే కాదు, నిజజీవితంలో కూడా పలు ఎన్జీవోలతో కలిసి ఎంతోమంది నిరుపేద చిన్నారుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది. ఇక ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని వారితో పంచుకోవాలనే ఆలోచనతో హన్సిక.. ఆ చిన్నారులను కూడా ఆహ్వానం అందించింది. దీంతో పెళ్ళికి హాజరయ్యేందుకు ఆ చిన్నారులు రెడీ అవుతున్న వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.
