Hansika marriage : నేడే హన్సిక పెళ్లి.. సంగీత్ లో డ్యాన్స్ తో రచ్చ చేసిందిగా..

నేడు రాజస్థాన్ లోని జైపూర్‌ ముండోటా ప్యాలెస్‌లో హన్సిక వివాహం సోహెల్ తో ఘనంగా జరగనుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. రెండు రోజులుగా హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ అంటూ హన్సిక...............

Hansika marriage : నేడే హన్సిక పెళ్లి.. సంగీత్ లో డ్యాన్స్ తో రచ్చ చేసిందిగా..

Hansika marriage with soheal in Rajasthan

Updated On : December 4, 2022 / 7:19 AM IST

Hansika marriage :  తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్, హిందీలో ఇప్పటికే 50 సినిమాలు చేసేసింది యాపిల్ బ్యూటీ హన్సిక. కొన్ని రోజుల క్రితమే తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని తన కాబోయే భర్తని అందరికి పరిచయం చేసింది. ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ సోహెల్ ప్రపోజ్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది హన్సిక.

Vasishta-Haripriya : పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో హీరో, హీరోయిన్.. సింపుల్ గా నిశ్చితార్థం..

నేడు రాజస్థాన్ లోని జైపూర్‌ ముండోటా ప్యాలెస్‌లో హన్సిక వివాహం సోహెల్ తో ఘనంగా జరగనుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. రెండు రోజులుగా హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ అంటూ హన్సిక, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు. శనివారం రాత్రి హన్సిక సంగీత్ ఫంక్షన్ జరగగా ఇందులో కాబోయే భర్త సోహెల్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ వీడియోల్ని సోహెల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి.