Amritha Aiyer : ‘నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా.. కానీ’.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హనుమాన్ హీరోయిన్..

టాలీవుడ్ నటి అమృత అయ్యర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈమె.

Hanuman heroine Amritha Aiyer gave clarity on her marriage

Amritha Aiyer : టాలీవుడ్ నటి అమృత అయ్యర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈమె. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీకి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ నటి కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చల మల్లి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో దీనికి సంబందించిన ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వూస్ ఇస్తున్నారు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న అమృత అయ్యర్. అయితే ఈమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన పెళ్లిపై కామెంట్స్ చేసింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో తెలిపింది.

Also Read : Bhanushree Mehra : అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం..

” నెక్స్ట్ ఇయర్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నా ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని నా ఫీలింగ్. అందుకే చేసుకోవద్దు అనుకుంటున్నాను. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు అని తెలిపింది”. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వచ్చే ఏడాది ఈమె పెళ్లి చేసుకుంటుందా లేదా చూడాలి.