Hanuman Poster In 'The Flash' movie
Hanuman – The Flash : DC యూనివర్స్ నుంచి రీసెంట్‌గా రిలీజైన సినిమా ‘ది ఫ్లాష్’ సినిమాలోని ఓ క్లిప్ లో హనుమంతుని పోస్టర్ ఉన్నట్లు నెటిజన్లు గుర్తించారు. ఇప్పుడు ఈ క్లిప్ వైరల్ అవుతోంది.
Adipurush : ఆదిపురుష్‌కు ‘ది ఫ్లాష్’ టెన్షన్.. ఇండియాలో కాదు గానీ.. ఓవర్సీస్‌లో మాత్రం..
అమెరికన్ సూపర్ హీరో సినిమా ‘ది ఫ్లాష్’ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపించింది. ఎజ్రా మిల్లర్, సాషా కాల్లే మరియు మైఖేల్ షానన్ ఈ సినిమాలో కీ రోల్స్‌లో నటించారు. విభిన్నమైన కథతో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో బారీ అలెన్ రూంలో లార్డ్ హనుమంతుని పోస్టర్‌ను రీసెంట్‌గా నెటిజన్లు గుర్తించారు. ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Adipurush : ఆదిపురుష్ హనుమాన్ డైలాగ్స్ పై వివాదం.. నేనేమి తప్పుగా రాయలేదు అంటూ స్పందించిన రైటర్..
@jatinsapra అనే ట్విట్టర్ యూజర్ ఈ పోస్టర్‌ను షేర్ చేసుకుంటూ ‘ఫ్లాష్ సినిమాలో బారీ అలెన్ రూంలో హనుమంతుని పోస్టర్ ఉంది. కారణం ఎవరికైనా తెలుసా?’ అనే శీర్షికతో షేర్ చేశాడు. దీనిపై చాలామంది స్పందించారు. ‘బారీ అలెన్ గదిలో హనుమాన్ జీ ఎందుకున్నారో తెలుసుకోవాలని ఉంది’ అని ఒకరు.. ‘ఫ్లాష్ రూంలో పోస్టర్ ఉంది.. థియేటర్ ఆదిపురుష్‌గా మారుతుందని నేను అనుకుంటున్నాను’ అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్లు చేశారు. కారణం ఏంటనేది తెలియదు కానీ కామెంట్లు మాత్రం హనుమాన్ పోస్టర్ ఉండటం వెనుక కారణం తెలుసుకోవాలనే క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
In the #Flash movie, Barry Allen has a picture of Lord Hanuman in his room. Anyone knows the reason or reference?#TheFlashMovie #DCFC pic.twitter.com/kg7753XN1b
— Jatin Sapra (@jatinsapra) June 15, 2023