Bomma Blockbuster: రష్మీ “బ్లాక్ బస్టర్” సినిమాని ప్రమోట్ చేసేందుకు వచ్చిన హర్భజన్ సింగ్..
జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్, నందు విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలలో వస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "బొమ్మ బ్లాక్ బస్టర్". నవంబర్ 4న విడుదలకు సిద్దమవడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హీరో నందు ఇండియన్ స్టార్ క్రికెటర్...
- gum 95921
- Published On : October 25, 2022 / 08:18 PM IST
Harbhajan Singh Promoting Rashmi Bomma Blockbuster Movie
Bomma Blockbuster: జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్, నందు విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలలో వస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఇటీవల విడుదలయిన టీజర్ అండ్ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. నందు, రష్మీ ల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా యూత్ ని అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.
Bomma Blockbuster: పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా?
నవంబర్ 4న విడుదలకు సిద్దమవడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హీరో నందు ఇండియన్ స్టార్ క్రికెటర్ ని రంగంలోకి దించాడు. ఒకప్పటి స్టార్ బౌలర్ “హర్భజన్ సింగ్”తో ఒక ప్రమోషనల్ వీడియోని చేసి విడుదల చేశాడు. క్రికెట్ కామెంటర్ గా చేయడంతో.. హీరో నందుకి హర్భజన్ తో కొంత సాన్నిహిత్యం ఉంది.
దీంతో ఈ స్టార్ ఆటగాడు సినిమాలోని డైలాగ్ చెబుతూ.. “నేను వాళ్ళని కొట్టిన, వాళ్ళు నన్ను కొట్టిన చిరంజీవి మాత్రం నేనే” అంటూ నందుతో కలిసి చేసిన రీల్ ని.. హీరో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరీటి దామరాజు, రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
