Hari Hara Veera Mallu Left With Only One Option
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పిటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, హిస్టారికల్ ఎపిక్ మూవీగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.
Hari Hara Veera Mallu: వీరమల్లు టీజర్ కోసం ఆతృతగా చూస్తున్న ఫ్యాన్స్!
ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, పవన్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అనే సినిమాలను పట్టాలెక్కి్స్తున్నాడు. ఇక ఇప్పుడు సముద్రఖని డైరెక్షన్‌లో ‘వినోదయ సీతం’ను కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో, ఈ సినిమా రిలీజ్‌కు ఇక ఒకే సమయం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Hari Hara Veera Mallu: కన్ఫ్యూజన్‌లో పడేసిన వీరమల్లు.. వస్తాడా రాడా..?
దసరా సీజన్‌లో ఈ సినిమా ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేదంటే, మళ్లీ సంక్రాంతి వరకు హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ ఛాన్స్ లేదని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నిటిస్తున్నారు.