×
Ad

Harish Shankar : పొలిటికల్ కంటెంట్ లేదు.. పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..

తాజాగా హరీష్ శంకర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.(Harish Shankar)

  • Published On : February 23, 2026 / 06:20 PM IST

Harish Shankar

Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ ఈ సినిమా గురించి మాట్లాడారు. (Harish Shankar)

నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే పాట రిలీజ్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి తగ్గ పాటలా ఉంది. దీంతో ఈ సినిమాలో పవన్ పొలిటికల్ కెరీర్ కి తగ్గట్టు డైలాగ్స్ ఉంటాయని, ప్రత్యర్థులకు పంచ్ లు ఉంటాయని ఫ్యాన్స్, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

Also Read : Chiranjeevi Balakrishna : ఏంటి.. నిజంగానే బాలయ్య – చిరు కలుస్తున్నారా? అదే జరిగితే..

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ రిలీజ్ మాట్లాడుతూ.. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ పాట పవన్ పర్సనల్ వ్యక్తిత్వానికి, ఆయన యాటిట్యూడ్ కి దగ్గరగా ఉండటంతో కొంతమంది ఈ సినిమాలో పొలిటికల్ రిఫరెన్స్ లు ఉంటాయా అని అడుగుతున్నారు. పవన్ గారు మొదటి నుంచి సినిమా వేరు పాలిటిక్స్ వేరు అని చెప్తూనే ఉంటారు. అందుకే ఆయన్ని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ తో కూడా కలిసి నటిస్తారు. ఈ సినిమా చేసేటప్పుడు హరీష్ మన సినిమాలో ఒక డైలాగ్ కానీ, ఒక సీన్ కానీ ఎవర్ని తప్పుగా చూపించకూడదు, ఎవర్ని కించపరచకూడదు అన్నారు.

హీరోని ఎలివేషన్ చేసే డైలాగ్స్ తప్ప ఇంకొకరి మీద డైలాగ్స్ లేవు. ఆయనకు అన్ని పార్టీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా పాలిటిక్స్ రిఫరెన్స్ లు వద్దు ఎంటర్టైన్మెంట్ కావలి అని అడిగారు. అలాంటి ఫ్యాన్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తిని కానీ, ఏ పార్టీని కానీ, ఏ వర్గాన్ని కానీ కించపరిచేలా ఈ సినిమాలో డైలాగ్స్ ఉండవు అని అన్నారు.

Also Read : Sivaji : వైసీపీకి సపోర్ట్ చేసే నటీనటులకు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదా? స్పందించిన శివాజీ.. ఏమన్నాడంటే..?

దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఎలాంటి పాలిటిక్స్ డైలాగ్స్ లేవని, ఈ సినిమా మొదలయిన సమయంలో ఎన్నికల ముందు అనుకున్న కథని కూడా పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది.