Harish Shankar : పవన్ అభిమానులకు శుభవార్త చెప్పబోతున్న హరీష్ శంకర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి హిట్టు అయ్యిందో అందరికి తెలుసు. మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ర్టీ వర్గాల్లో కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ దర్శకుడు ఈ ఏడాది మధ్యలో 'భవదీయుడు భగత్‌సింగ్' అంటూ పవన్ తో సినిమా ప్రకటించాడు. కాగా..

Harish Shankar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి హిట్టు అయ్యిందో అందరికి తెలుసు. పవన్ అభిమానుల గుండెల్లో ఆ సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ర్టీ వర్గాల్లో కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ దర్శకుడు ఈ ఏడాది మధ్యలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అంటూ పవన్ తో సినిమా ప్రకటించాడు.

Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం: పవన్ కల్యాణ్

అయితే సినిమా అనౌన్స్‌మెంట్ తరువాత మరో అప్డేట్ ఇవ్వకపోవడం, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా మునపటి సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకోకపోవడంతో ఈ సినిమా ఇప్పటిలో ఉండదు అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా హరీష్ శంకర్.. ఒక బిగ్ ఎక్సైట్‌మెంట్ రాబోతుంది, వెయిట్ చేయండి” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ‘భవదీయుడు’ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నారు అంటూ సందడి చేస్తున్నారు అభిమానులు.

కాగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని, ఈ అనౌన్స్‌మెంట్ తమిళ సినిమా ‘తేరీ’ రీమేక్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రంలోని వార్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు