Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది. దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది. దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వాహన ట్రయల్ రన్ ను పవన్ కల్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు చేశారు పవన్. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ పవన్ చర్చించారు.

ఈ వాహనానికి ‘వారాహి’ అమ్మవారి పేరుపెట్టారు. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారి పేరు (పురాణాల ప్రకారం)ను పవన్ తన ఎన్నికల ప్రచార వాహనానికి పెట్టారు.

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తెలంగాణలోని కొండగట్టు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనుష్టు నారసింహ యాత్ర పేరుతో ఏపీతో పాటు తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిద్దామని తెలంగాణలోని తమ కార్యకర్తలు, అభిమానులకు పవన్ కల్యాణ్ కొన్ని వారాల క్రితమే చెప్పారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆ సమయంలో టీడీపీ-బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించి, ప్రచారంలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన.. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Kid Reaction Seeing Alcohol Bottles : ఫ్రిడ్జ్‌లో మద్యం బాటిల్స్ చూసి చిన్నారి ఆనందం,బుడిబుడి అడుగులేసే వయస్సులోనే ‘చుక్క’కావాలా ఏంటీ..?!