KCR slams Modi: ఇదేనా మేకిన్ ఇండియా అంటే?: మోదీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంంటూ నినాదాలు ఇస్తున్నారని, అంటే ఏంటని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నినాదాలు, మాటలు తప్పా ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని చెప్పారు. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటే? అని నిలదీశారు.భారతదేశ యువకులు అందరూ పిడికిలి బిగించి, చేతులు ఎత్తాలని కేసీఆర్ అన్నారు.

KCR slams Modi: ఇదేనా మేకిన్ ఇండియా అంటే?: మోదీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

KCR slams Modi: ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంంటూ నినాదాలు ఇస్తున్నారని, అంటే ఏంటని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నినాదాలు, మాటలు తప్పా ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని చెప్పారు. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటే? అని నిలదీశారు.

భారతదేశ యువకులు అందరూ పిడికిలి బిగించి, చేతులు ఎత్తాలని కేసీఆర్ అన్నారు. అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, చివరకు ఎల్ఐసీని కూడా ప్రైవేటుపరం చేస్తారట అని అన్నారు. ఎల్ఐసీలోని మిత్రులు పోరాడాలని అన్నారు. జాతీయ జెండాను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా? అని నిలదశారు. మేకిన్ ఇండియా అంటే ఏంటని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని చెప్పారు.

విద్యావంతులు ఆలోచించాలన కేసీఆర్ చెప్పారు. ఒక్కసారి దేశం దెబ్బ తింటే 100 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతామని తెలిపారు. జగిత్యాల, కరీంనగర్ లో చైనా బజార్లు ఉన్నాయని, ఊరూరా చైనా బజార్లు ఎందుకు అని ప్రశ్నించారు. దీపావళి పటాకులు చైనా నుంచే రావాలా అని అడిగారు. విద్యుత్తు ప్రైవేటీకరణ అంటున్నారని, ముక్కు పిండి వసూలు చేస్తామంటున్నారని చెప్పారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో అంటూ అనేక నినాదాలు ఇస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని కేసీఆర్ చెప్పారు. గోల్ మాల్ గోవిందాలను నమ్మి ఆగం కావద్దని సూచించారు. రైతు బంధు, రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

Dangerous Android Apps : గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ ఆండ్రాయిడ్ యాప్స్.. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే.. ఇప్పుడే డిలీట్ చేసేయండి..!