Dangerous Android Apps : గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ ఆండ్రాయిడ్ యాప్స్.. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే.. ఇప్పుడే డిలీట్ చేసేయండి..!
Dangerous Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో (Android Devices) ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. లేదంటే.. మీ విలువైన డేటా హ్యాకర్ల చేతుల్లో చిక్కే ప్రమాదం ఉంది.

Dangerous Android Apps with over 2 million downloads found on Play Store, delete them immediately
Dangerous Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో (Android Devices) ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. లేదంటే.. మీ విలువైన డేటా హ్యాకర్ల చేతుల్లో చిక్కే ప్రమాదం ఉంది. యూజర్ల డేటాను తస్కరించే డేంజరస్ మాల్వేర్‌తో కూడిన యాప్స్ ఉన్నాయని ఓ సెక్యూరిటీ కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో మాల్వేర్‌తో కూడిన డేంజరస్ యాప్‌ల గ్రూపు ఉందని భద్రతా సంస్థ కనుగొంది. డాక్టర్ వెబ్ యాంటీవైరస్ టూల్స్ ద్వారా గుర్తించిన ఈ డేంజరస్ యాప్‌లు 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు కలిగి ఉన్నాయని తేలింది. మాల్వేర్‌తో నిండిన కొన్ని యాప్‌లు Google Playలో అందుబాటులో లేవు.
అయినప్పటికీ, వినియోగదారులు తమ ఫోన్‌లలో వాటిని ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ప్రైవేట్ డేటాను సేఫ్‌గా ఉంచుకోవాలంటే వాటిని వెంటనే డివైజ్ నుంచి తొలగించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్యూబ్‌బాక్స్ (TubeBox) అని పిలిచే యాప్‌లలో ఒకటి.. ఈ యాప్ ఒక మిలియన్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. అందులో వీడియోలు, యాడ్స్ చూడటం ద్వారా డబ్బు సంపాదించడంలో యూజర్లకు సాయపడుతుందని యాప్ డేటా సూచిస్తోంది.
అయితే యూజర్లు అకారణంగా యాప్ నుంచి రివార్డ్‌లను పొందవచ్చు. వాటిని తర్వాత కరెన్సీగా మార్చవచ్చు. ఈ యాప్ క్రియేటర్లు తమ బాధితులను వీలైనంత కాలం పాటు స్ట్రింగ్ చేసేందుకు ప్రయత్నించారని డాక్టర్ వెబ్ పేర్కొంది. తద్వారా వారు వీడియోలు, యాడ్స్ చూసేందుకు అనుమతిస్తారు. ఈ యాప్ ద్వారా సైబర్ మోసగాళ్లు డబ్బును దొంగిలించే అవకాశం ఉంది.
ఈ యాప్‌లతో జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి :
గూగుల్ ప్లే స్టోర్‌లో ఫాస్ట్ క్లీనర్ & కూలింగ్ మాస్టర్ (Fast Cleaner & Cooling Master) మరో డేంజరస్ యాప్ ఉంది. ఇది Play Storeలో OS ఆప్టిమైజేషన్ టూల్‌గా అందుబాటులో ఉంది. వాస్తవానికి, యాప్ ఇన్ స్టాల్ అయిన డివైజ్‌లో యాడ్స్ డిస్‌ప్లే చేస్తుంది. లేదా ప్రాక్సీ సర్వర్‌కు యాక్సస్ అందిస్తుంది. థర్డ్ పార్టీ ఈ ప్రాక్సీని దీని ద్వారా ట్రాఫిక్‌ని ఛానెల్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఈ యాప్ ఇప్పటివరకూ 5లక్షల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. కొత్త యాడ్‌వేర్ మాడ్యూల్ (adware module)ను కలిగి మరికొన్ని యాప్‌లను కూడా సెక్యూరిటీ కంపెనీ గుర్తించింది.
మాడ్యూల్ ఫైర్‌బేస్ క్లౌడ్ మెసేజింగ్ (Firebase Cloud Messaging) ద్వారా ఆదేశాలను అందుకుంటుంది. వాటిలో డేంజరస్ వెబ్‌సైట్‌లను కలిగి ఉంటుంది. ఈ మాల్వేర్ ద్వారా ప్రభావితమైన యాప్‌లలో బ్లూటూత్ డివైజ్ ఆటో కనెక్ట్, బ్లూటూత్, Wi-Fi, USB డ్రైవర్, వాల్యూమ్, మ్యూజిక్ ఈక్వలైజర్ ఉన్నాయి. ఈ మూడు యాప్‌లు 1.15 మిలియన్ల సార్లు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ఇన్‌స్టాల్ అయినట్టు కంపెనీ గుర్తించింది.

Dangerous Android Apps with over 2 million downloads found on Play Store
Dr Web Android.FakeApp ట్రోజన్ ఫ్యామిలీతో కూడిన యాప్‌లను కూడా కనుగొంది. ఈ ఫేక్ యాప్‌లు యూజర్లను మోసపూరిత సర్వేలలో పాల్గొనేలా చేసేందుకు, అకౌంట్లను నమోదు చేసుకోవడానికి, వారి వ్యక్తిగత డేటాను సేకరించేందుకు అప్లికేషన్లు సమర్పించేందుకు రూపొందించింది.
ఈ యాప్‌లు ప్రధానంగా రష్యన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. యూజర్ల డేటాను హ్యాక్ చేసిన సమయంలో ఆయా వ్యక్తులు, కంపెనీల ఫొటోలను ఉపయోగించారని “loud statements” చేస్తారని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకించి, ఆయా ఫేక్ యాక్స్ యూజర్లకు అధిక ఆదాయాన్ని పొందవచ్చునని నమ్మిస్తాయి.
యాప్ ఓపెన్ చేయగానే యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. మరింత ఆదాయం కోసం మరో 10 మందికి ఫ్రీగా షేర్లు చేయమని అడుగుతుంది. ఇంకా నేర్చుకుంటూనే సంపాదించండి. మీకు 100,000 USD ఇస్తానంటూ వంటి రష్యన్ లాంగ్వేజీలతో పాటుగా యాడ్స్ డిస్‌ప్లే చేస్తారు. మీరు 6 నెలల్లో కోటీశ్వరుడు అయిపోతారంటూ నమ్మిస్తారు.
ఈ యాప్‌లు వినియోగదారులను ఫిషై లింక్‌లపై క్లిక్ చేసి డేటాను దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకే ఇలాంటి డేంజరస్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి పూర్తి స్థాయిలో తొలగించడం జరిగిందో లేదో గూగుల్ వెల్లడించలేదు. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ డేంజరస్ యాప్స్ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డిలీట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..