×
Ad

Harish Shankar : నేను తేరి రీమేక్ చేయడం కాదు.. నా గబ్బర్ సింగ్ నుంచే తేరి కాపీ చేసారు..

ఆల్రెడీ గతంలోనే హరీష్ శంకర్ ఇది తేరి రీమేక్ కాదన్నా ఈ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై స్పందించాడు. (Harish Shankar)

  • Published On : March 2, 2026 / 06:41 PM IST

Harish Shankar

Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటించినప్పుడు తమిళ్ హీరో విజయ్ తేరి సినిమా రీమేక్ అన్నారు. కానీ సినిమా వాయిదా పడటం, ఎన్నికలు రావడం, ఎలక్షన్స్ లో పవన్ గెలవడంతో ఈ కథని, కథనాన్ని మార్చేశారు.

అయినా ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ తో ఈ సినిమా తేరి రీమేక్ అనే పలువురు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ చేసారు. ఆల్రెడీ గతంలోనే హరీష్ శంకర్ ఇది తేరి రీమేక్ కాదన్నా ఈ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై స్పందించాడు.

Also Read : Pawan Kalyan : 16 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న బెస్ట్ ఫ్రెండ్.. ఉస్తాద్ లో భారీ సెట్..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ సినిమా రీమేక్ కి నేను మార్పులు – దర్శకత్వం అని పేరు వేసుకున్నా. కానీ ఈ సినిమాకు కథ మాటలు దర్శకత్వం అని పేరు వేసుకుంటే రీమేక్ అంటారేంటి. తేరి రీమేక్ అనుకున్నాం కానీ కాదు. మొత్తం కథ కొత్తది.

గబ్బర్ సింగ్ సినిమాలో నేను పెట్టిన అంత్యాక్షరి సీన్ తీసుకొని తేరి లో అలాంటి సీన్ పెట్టారు. గబ్బర్ సింగ్ సినిమాని ఇన్ స్పైర్ తీసుకొని తేరిలో రౌడీలతో రైమ్స్ చెప్పిస్తాడు హీరో. నా సినిమాలోని సీన్స్ నే కాపీ చేసి తేరి చేస్తే నన్ను తేరి రీమేక్ చేస్తున్నావంటున్నారు. ఇంక నేనేం సమాధానం చెప్తాను అని అన్నారు.

Also See : Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం.. సందడి చేసిన యూట్యూబర్లు, సెలబ్రిటీలు.. ఫోటోలు..