Harish Shankar : ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ క్వాలిటీ దేవుడి మీదే భారం..?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా క్వాలిటీ గురించి ఓ నెటీజ‌న్ చేసిన కామెంట్ పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Harish Shankar strong counter

Harish Shankar strong counter : సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ (Harish Shankar) య‌మా యాక్టివ్‌గా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan) హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’. ఈ సినిమా క్వాలిటీ గురించి ఓ నెటీజ‌న్ చేసిన కామెంట్ పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ స‌ద‌రు నెటీజ‌న్ ఏమ‌ని ట్వీట్ చేశాడంటే.. ‘అప్పుడే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్త‌యింద‌ట క‌దా అన్నా.. ఇక క్వాలిటీ యా దేవుడి మీదే భారం వేశాం’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై హ‌రీశ్ శంక‌ర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. ‘అంతే క‌దా త‌మ్ముడు. అంత‌కు మించి నువ్వేం చేయ‌గ‌ల‌వు చెప్పు..? ఈ లోగా కాస్త కెరీర్‌, జాబ్‌, స్ట‌డీస్ మీద ఫోక‌స్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వ‌దిలేయ‌కు. ఆల్ ది బెస్ట్.’ అంటూ రిప్లై ఇచ్చాడు.

‘గ‌బ్బ‌ర్‌సింగ్’ త‌రువాత ప‌వ‌న్‌, హ‌రీశ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల న‌టిస్తోండ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ఓ కీల‌క షెడ్యూల్‌ను చిత్ర‌బృందం పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్ పై యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రించారు.

Celebrating ANR 100 : ఆ ఇమేజ్ పోగొట్టుకోడానికి.. ఎన్టీఆర్ పక్కన కమెడియన్‌గా ఏఎన్నార్..

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఓజీ చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా క్రిష్ డైరెక్ష‌న్ లో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు తెర‌కెక్కుతోంది.

Anthe kadha thammudu anthaku