Tuk Tuk : ‘టుక్ టుక్’ ట్రైలర్ చూశారా?? స్కూటర్ లో దేవుడా? దయ్యమా?

ఇప్పటికే టుక్ టుక్ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Harsh Roshan Karthikeyaa Dev Saanvee Megghana Tuk Tuk Trailer Released

Tuk Tuk : హర్ష రోషన్, కార్తికేయ, స్టీవెన్ మధు, శాన్వి మేఘన.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా టుక్ టుక్. చిత్రవాహిని ప్రొడక్షన్స్, RYG సినిమాస్ బ్యానర్స్ పై రాహుల్ రెడ్డి, సాయి వరుణ్, శ్రీరాములు నిర్మాణంలో సుప్రీత్ C కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే టుక్ టుక్ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే కొంతమంది టీనేజ్ కుర్రాళ్ళు ఓ స్కూటర్ ని ముగ్గురు కూర్చునే బండిగా మార్చి టుక్ టుక్ అనే పేరుతో తిప్పుతారు. ఆ స్కూటర్ కి ఏదో పవర్స్ ఉన్నాయని తెలియడంతో అది దయ్యమా లేక దేవుడా అని కంగారుపడతారు. మరి ఆ స్కూటర్ తో ఆ కుర్రాళ్ళు ఏం చేసారు, ఈ మధ్యలో ఒక ప్రేమకథతో సినిమా ఉండనుంది. టుక్ టుక్ సినిమా మార్చ్ 21 న రిలీజ్ కానుంది.

Also Read : Puri Jagannadh : తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వట్లేదని.. తమిళ్ స్టార్ తో పూరి జగన్నాధ్

మీరు కూడా టుక్ టుక్ ట్రైలర్ చూసేయండి..