Hebah Patel: ‘మిరాకిల్’ నా కెరీర్ లో బెస్ట్ మూవీ.. హెబ్బా పటేల్ ఆసక్తికర కామెంట్స్
మిరాకిల్ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్(Hebah Patel).
- V Santhosh Kumar
- Published On : March 12, 2026 / 08:25 PM IST
Hebah Patel interesting comments on Miracle movie
Hebah Patel: కుమారి 21ఎఫ్, ఈడో రకం – ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్ లాంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ.. ‘మిరాకిల్’ నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల’ అంటూ చెప్పుకొచ్చారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్(Hebah Patel). సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మిరాకిల్”.
హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రణధీర్ బీసు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కించాడు. ఈ సినిమా మూడో షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ పరిసర గ్రామమైన “కొండమడుగు”లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు “మిరాకిల్” చిత్రబృందం. ఈ నేపధ్యంలోనే తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా “మిరాకిల్” నిలిచిపోతుందని హెబ్బా పటేల్ ప్రకటించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.
Sravanthi Chokkarapu: చీరలో యాంకర్ స్రవంతి.. హాట్ లుక్ లో ఫొటోలు వైరల్
ఇక సీనియర్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘మిరాకిల్’ వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్ చేస్తారని, దర్శకుడిగా ప్రభాస్ నిమ్మలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి, అంకితభావం చూపుతుండడం నన్ను చాలా భావోద్వేగానికి లోనుచేస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీరామ్, సురేష్, హెబ్బా పటేల్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. కొండమడుగు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు మా యూనిట్ ఎప్పటికీ మర్చిపోదు’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… ‘ఈ మూడో షెడ్యూల్ తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తాం. మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది’ అని అన్నారు.
