25 ఏళ్ళ హలో బ్రదర్

25 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాగార్జున హలో బ్రదర్..

  • Publish Date - April 20, 2019 / 12:31 PM IST

25 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాగార్జున హలో బ్రదర్..

అక్కినేని నాగార్జున, సౌందర్య, రమ్యకృష్ణ జంటగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై, కె.ఎల్.నారాయణ నిర్మాణంలో, ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన సినిమా.. హలో బ్రదర్.. 1994 ఏప్రిల్ 20 న రిలీజ్ అయిన ఈ సినిమా 2019 ఏప్రిల్ 20 నాటికి 25 ఏళ్ళు అయ్యింది. నాగార్జున డ్యుయల్ రోల్, వాటిలో ఒకటి క్లాస్, మరోటి మాస్.. కథకి తగ్గ క్యారెక్టర్లు, క్యారెక్టర్లకి తగ్గ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఇ.వి.వి. ఆయన శైలి కామెడీనే అయినా, పెద్ద హీరోతో కామెడీ చేయించడం, దాన్ని తన స్టైల్‌లో చేసి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడం నాగార్జునకే చెల్లింది.

నాగ్ మేనరిజమ్స్, డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా వర్కవుటయ్యిందీ సినిమాలో.. కోట, బ్రహ్మానందం, అలీ, మల్లిఖార్జున రావు, బాబూ మోహన్ తదితరులు చేసిన కామెడీ ఓ రేంజ్‌లో ఉంటుంది.. రాజ్-కోటి సంగీతం సినిమాకి హైలెట్‌గా నిలిచింది. కన్నెపెట్టరోయ్, కన్ను కొట్టరోయ్ సాంగ్‌లో రంభ, ఆమని, ఇంద్రజ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇన్ని ప్రత్యేకతలు గల హలో బ్రదర్.. నాగార్జున కెరీర్‌లో మరపురాని సినిమాగా మిగిలిపోయింది.

వాచ్.. ప్రియ రాగాలే వీడియో సాంగ్..