Dharmendra: ఆస్కార్ వేదికపై నటుడు ధర్మేంద్రకు అవమానం.. ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య హేమమాలిని

ఆస్కార్ వేదికపై తన భర్త ధర్మేంద్ర(Dharmendra)కు అవమానం జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన హేమమాలిని

Hema Malini expresses anguish, claiming Dharmendra was insulted on the Oscar stage.

  • ఆస్కార్ నిర్వాహకులపై హేమమాలిని ఆగ్రహం
  • ఇన్ మెమోరియంలో ధర్మేంద్ర కనిపించకపోవడంపై ఆవేదన
  • అసహనం వ్యక్తం చేసిన కూతురు ఈషా డియోల్

Dharmendra: ఇండియన్ సినీ హిస్టరీలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటుడు ధర్మేంద్రకు అంతర్జాతీయ వేదికపై అవమానం జరిగిందనే వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన 98వ ఆస్కార్ వేడుకలో మరణించిన సినీ ప్రముఖులకు ఇచ్చే ‘ఇన్ మెమోరియం’ నివాళి విభాగంలో ధర్మేంద్ర పేరును టీవీ ప్రసారంలో చూపించకపోవడం వివాదానికి దారితీసింది. దీనిపై ఆయన భార్య, నటి హేమమాలిని తీవ్రంగా స్పందించారు.

Neelira: ఊహించని కాంబోలో ‘నీళిరా’.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో రానా కొత్త మూవీ

‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధర్మ్(Dharmendra) జీ వంటి నటుడిని ఆస్కార్ వేదికపై విస్మరించడం సిగ్గుచేటు. ఆయనకు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు ఉంటుంది, ఆస్కార్ వారి గౌరవం ఆయనకు అవసరం లేదు’ అని మండిపడ్డారు. తన జీవితకాలంలో ఆయనకు పెద్దగా అవార్డులు రాకపోయినా, ప్రజల ప్రేమే అన్నిటికంటే పెద్ద పురస్కారమని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్ దిగ్గజాలకు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా నివాళులర్పించిన అకాడమీ, భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడిని లైవ్ టెలికాస్ట్‌లో చూపించకపోవడాన్ని నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు.

మరోవైపు ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ కూడా ఈ విషయంపై స్పందించారు.. ‘నా తన తండ్రి ఇలాంటి చిన్న విషయాలను ఎప్పుడూ పట్టించుకోరు, ఆయన ఎప్పటికీ ఒక లెజెండ్‌గానే నిలిచిపోతారు’ అని అన్నారు. అయితే, ఆస్కార్ అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్ జాబితాలో మాత్రం ధర్మేంద్ర పేరును చేర్చింది. ఆయనతో పాటు ఇండియన్ నుంచి కోట శ్రీనివాసరావు, సరోజా దేవి, మనోజ్ కుమార్, ఎస్. కృష్ణస్వామి, జయశ్రీ కబీర్ల పేర్లను ఆన్‌లైన్ గ్యాలరీలో చేర్చింది. అయితే, వారి పేర్లను ప్రధాన వేదికపై చూపించకపోవడం మాత్రం ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసింది.