కొడుకు బర్త్ డేకు స్పెషల్ ఫొటో బయటపెట్టిన మోహన్‌లాల్

సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. 30వ ఏట అడుగుపెట్టిన ప్రణవ్ కు బర్త్ డే సందర్భంగా జుక్స్‌టాఫోజ్‌తో విషెస్ తెలిపారు. చిన్నప్పటి ఫొటోతో పాటు ఇప్పటి ఫొటోను కలిపి పోస్టు చేసి.. స్వీట్ బర్త్ డే నోట్ కూడా రాశారు. ఫస్ట్ ఫొటోలో కొడుకుని చేతుల్లోకి తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకుని ఉన్నారు. రెండో ఫొటో రీసెంట్ గా కెమెరా ముందు ఫోజిచ్చిన ఫొటో.

నా చిన్నారి కొడుకు ఏమంత చిన్నవాడు కాదు. నువ్వు ఎదుగుతున్న కొద్దీ గర్వపడే ఒకే ఒక వ్యక్తిని నేనే. నీకు 30ఏళ్లు రాబోతున్నాయి. హ్యాపీ బర్త్ డే ప్రణవ్ మోహన్ లాల్ అని పోస్టు పెట్టాడు. మోహన్ లాల్ పెట్టిన పోస్టుపై మీరూ ఓ లుక్కేయండి..

మోహన్ లాల్, ప్రణవ్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. 2018లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రణవ్ లీడింగ్ యాక్టర్ గా దూసుకెళ్తున్నారు. చిన్నతనంలోనే ప్రణవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 2002 ఒన్నామన్ ఎంట్రన్స్ ఇచ్చారు.

జీతూ జోసెఫ్ డైరక్షన్ లో 2013లో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అయ్యారు. అప్పట్లో భారీ హిట్ సాధించి పలు భాషల్లో రీమేక్ కూడా తీశారు. దీని స్క్రిప్ట్ కు కూడా మోహన్ లాల్ ఓకే చెప్పేశారు. మే నెలలో ఆయన బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి విషయాన్ని అనౌన్స్ చేశారు.