Akhil Akkineni : సంచలన విషయాలను వెల్లడించిన అఖిల్.. నేను ఇండియన్‌ను కాదు.. త్వరలోనే..
ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తన పౌరసత్వంపై స్పష్టత ఇచ్చారు
- Thota Vamshi Kumar
- Updated on- July 25, 2026 / 11:26 AM IST
Akhil Akkineni reveals his citizenship
Akhil Akkineni : అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి హీరోగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల లెనిన్‌తో తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే.. తాజాగా అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అతడి పౌరసత్వం గురించి.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తన పౌరసత్వంపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను అమెరికా పౌరుడినేనని, అయితే త్వరలో భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
HBD Nara Rohith : పుట్టిన రోజు శుభాకాంక్షలు భర్త గారూ.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్..
1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ జోస్ నగరంలో అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కడి చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించడంతో అఖిల్‌కు అమెరికా పౌరసత్వం లభించింది. ఆయన వద్ద అమెరికా పాస్ పోర్టు కూడా ఉంది. కాగా.. చిన్నప్పటి నుంచి భారతదేశంలో పెరిగిన అఖిల్ తన విద్యలో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఆస్ట్రేలియాలో కూడా చదువుకున్నాడు. ఆ తరువాత నటనపై ఆసక్తితో అమెరికాలోని న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో శిక్షణ కూడా పొందారు.
ఇటీవల అఖిల్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. మీరు అమెరికన్ సిటిజనా? ఇండియన్ సిటిజనా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి అఖిల్ సూటిగా సమాధానం చెప్పాడు. తాను ప్రస్తుతం అమెరికా పౌరుడినేనని, తన వద్ద అమెరికా పాస్‌పోర్టు కూడా ఉందన్నాడు. అయితే.. ప్రస్తుతం ఆ పౌరసత్వాన్ని వదులుకునే ప్రక్రియలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇంకొన్ని నెలల్లో పూర్తిగా భారతీయుడిని అవుతాను అని తెలిపాడు. ఏది ఏమైనప్పటికి కూడా తాను ఇండియన్ అని, మేరా భారత్ మహాన్ అని అన్నాడు.
ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. బాలనటుడిగా ‘సిసింద్రీ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్, తర్వాత ‘మనం’లో అతిథి పాత్రలో మెరిశారు. 2015లో ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదలైన ‘లెనిన్’ తో కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు
