Hero Manchu Manoj made interesting comments on Pawan Kalyan
Manchu Manoj: మిరాయ్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే కారణం అని చెప్పాడు హీరో మంచు మనోజ్. ఇటీవల ఆయన విలన్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. యాక్షన్ అడ్వెంచర్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపధ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్(Manchu Manoj) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు ఆయన మిరాయ్ సినిమా ఒకే చేయడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు.
OG Trailer: ఓజీ ట్రైలర్ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇంకా ఈ ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ.. “అందరిలాగే నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన కూడా నాపై అంతే ప్రేమ చూపిస్తారు. నేను ఒకరోజు భీమ్లా నాయక్ షూట్ కి వెళ్లాను. అక్కడ పవనన్నతో చాలా సేపు మాట్లాడాను. ఆ సమయంలో ఆయన నా కెరీర్ గురించి మాట్లాడుతూ నువ్వు నెగిటివ్ రోల్‌లో చేస్తే చూడాలని ఉంది. నువ్వు విలన్‌గా చేస్తే మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్టువి అయిపోతావ్. ఒక్కసారి ట్రై చెయ్” అని చెప్పారు. నేను కూడా చాలా ఆలోచించా. ఆయన ఇచ్చిన సలహా మేరకే మిరాయ్ కథను ఒకే చేశా. మిరాయ్ సినిమా వల్ల నాకు వస్తున్న ప్రశంసలన్నీటికీ కారణం పవనన్నే అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, రితిక నాయక్ జంటగా నటించారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. కేవలం అయిదు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి లాగ్ రన్ ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.