Hero Nani and Rana comments on Nepotism in Nijam with Smitha sony liv ott talk show full episode streaming from feb 24th
Nani Vs Rana : ఇటీవల సరికొత్త టాక్ షోలు వస్తూ జనాలని మరింత ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటి సోని లివ్ లో గత రెండు వారాలుగా నిజం విత్ స్మిత అనే టాక్ షో స్ట్రీమ్ అవుతుంది. పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ షోలో మొదటివారం మెగాస్టార్ చిరంజీవి రాగా, రెండవ వారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి అనేక విషయాలు పంచుకున్నారు. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు.
నిజం విత్ స్మిత మూడో ఎపిసోడ్ కి హీరో నానితో పాటు రానా దగ్గుబాటి వచ్చారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి ఓ అవార్డు ఫంక్షన్ ని కూడా హోస్ట్ చేసి అందర్నీ ఎంటర్టైన్ చేశారు కూడా. అయితే వీరిలో నాని సొంతంగా ఎదిగి పైకి వచ్చినవాడైతే, రానా సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవాడని అందరికి తెలుసు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్మిత ఇదే విషయంపై నెపోటిజం గురించి ప్రశ్నించింది.
దీనిపై నాని మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ఓ లక్ష మంది చూసి ఉంటారు, కాని రామ్ చరణ్ మొదటి సినిమా ఒక కోటిమంది చూసి ఉంటారు. అప్పుడు నెపోటిజంని ప్రోత్సహిస్తుంది అలా చూసేవాళ్ళు కదా అని అన్నాడు. ఇక రానా దీనిపై స్పందిస్తూ.. తల్లితండ్రుల వారసత్వాన్ని తీసుకున్నప్పుడు దాన్ని నిలబెట్టాల్సిన భాద్యత మా మీద ఉంది. వాళ్ళ స్థాయిని దాటి ఎదగాలి లేకపోతే అందరూ మమ్మల్ని రకరకాల మాటలు అంటారు అని అన్నాడు.
Ranbir Kapoor : పఠాన్ కలెక్షన్స్ చూడలేదా అంటూ BBC రైడ్స్ పై కౌంటర్ వేసిన రణబీర్ కపూర్..
మరి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాల గురించి ఈ ఇద్దరు చర్చించారో చూడాలి. ఇక ఈ నిజం విత్ స్మిత మూడో ఎపిసోడ్ శుక్రవారం ఫిబ్రవరి 24 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. రానా, నాని అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నాని త్వరలో దసరా సినిమాతో రానున్నాడు. రానా త్వరలో రానా నాయుడు సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.