Nara Rohit : తండ్రైన హీరో నారా రోహిత్..
హీరో నారా రోహిత్ (Nara Rohit) తండ్రి అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 24, 2026 / 11:35 AM IST
Hero nara rohit and sirisha have become parents
Nara Rohit : హీరో నారా రోహిత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య శిరీష సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చిందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
ప్రతినిధి 2 చిత్రంలో నారా రోహిత్, శిరీష కలిసి నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2025 అక్టోబర్ 30న వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఈ దంపతుల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టాడు.
Jayam Ravi : చోరీకి పాల్పడ్డారని ఆరోపణ.. పని మనుషులను ఇంట్లో బంధించిన హీరో జయం రవి
టాలీవుడ్ ఇండస్ట్రీలో నారా రోహిత్ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశారు. ఇటీవల ‘సుందరకాండ’ మూవీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.
