Nithiin
Nithiin : వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరో నితిన్ ఒకరు. ఎంత కష్టపడినా, ఎంత కొత్తగా ప్రయత్నించినా నితిన్ హిట్ కొట్టడం కష్టం అయిపోయింది. చాలా సూపర్ హిట్ సబ్జెక్ట్స్ నితిన్ దగ్గరికి వెళ్లినా ఏవేవో కారణాలతో వద్దనుకున్నాడు. బలగం వేణు నుంచి నెక్స్ట్ రాబోయే ఎల్లమ్మ సినిమా నితిన్ చేయాలి, ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అనుకున్నారు. మరి ఏమైందో ఆ సినిమా నుంచి కూడా నితిన్ తప్పుకున్నాడు.(Nithiin)
ఎట్టకేలకు నితిన్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నితిన్ 36వ సినిమాని నేడు ప్రకటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులకు మంచి అనుభవం ఇచ్చే దర్శకుడు VI ఆనంద్ దర్శకత్వంలో నితిన్ సినిమా అనగానే ఆసక్తి నెలకొంది.
Also Read : Baa Baa Black Sheep : శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ కొడతాడా చూడాలి.