×
Ad

Pradeep Ranganathan: ఓజీ వైబ్ నెక్స్ట్ లెవల్ అసలు.. పవన్ కళ్యాణ్ పై ప్రదీప్ రంగనాథన్ క్రేజీ కామెంట్స్

లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు (Pradeep Ranganathan)తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. దర్శకుడి నుంచి హీరోగా మారిన ప్రదీప్ ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Hero Pradeep Ranganath made crazy comments on Pawan Kalyan's OG movie

Pradeep Ranganathan: లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. దర్శకుడి నుంచి హీరోగా మారిన ప్రదీప్ ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (Pradeep Ranganathan)తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా లవ్, బ్రేకప్, పెయిన్, ఫ్యామిలీ ఇలా చాలా ఎమోషన్స్ ని ఈ ట్రైలర్ లో చూపించారు. దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Nagarjuna-Tabu: నిన్నే పెళ్లాడుతా జోడీ మరోసారి.. నాగ్ 100వ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు.. అయితే ఈసారి..

అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమంలో ఓజీ సినిమాపై, పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో ప్రదీప్ రంగనాథన్. ఓజీ సినిమా రిలీజ్ టైంలో హీరో ప్రదీప్ చెన్నై నుంచి వచ్చి మరీ ఓజీ సినిమాను హైదరాబాద్ లో చూశాడు. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే విషయాన్ని ఒక రిపోర్టర్ ప్రస్తావించారు. మీరు ఓజీ సినిమా ఫస్ట్ డే చూశారు కదా ఎలా అనిపించింది అని అడిగారు. దానికి సమాధానంగా ప్రదీప్ మాట్లాడుతూ.. “నాకు ఓజీ సినిమా చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైబ్ నెక్స్ట్ లెవల్ అసలు. అది నేను ఎప్పటికి మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి ఈ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇక డ్యూడ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. డీజీ టిల్లు సినిమాలో రాధికగా కనిపించిన నేహా శెట్టి ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తోంది. మరి ఇప్పటికే తెలుగు లవ్ టుడే, రైటర్స్ అఫ్ ది డ్రాగన్ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.