Ram Charan : జ‌స్‌ప్రీత్ బుమ్రాకు రామ్‌చ‌ర‌ణ్ క్ష‌మాప‌ణ‌లు.. జ‌న‌సందోహం, హంగామా మ‌ధ్య అలా జ‌రిగిపోయింది

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan ) న‌టిస్తున్న మూవీ పెద్ది.

Hero Ram Charan apologies about his comment on bumrah

Ram Charan : మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జూన్ 4న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో చిత్ర బృందం వేగం పెంచింది. అందులో భాగంగా భోపాల్‌లో శ‌నివారం మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వెంట్‌లో హీరో రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ కాస్త‌త‌డ‌బ‌డ్డారు.

రామ్‌చ‌ర‌ణ్‌తో యాంక‌ర్ ర్యాపిడ్ ఫైర్ నిర్వ‌హించారు. భార‌త క్రికెట‌ర్ల‌ను కొన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌మ‌ని అడిగారు. స‌చిన్ టెండూల్క‌ర్ గురించి అడుగ‌గా.. ఆ దిగ్గ‌జ ఆట‌గాడిది సుదీర్ఘ‌మైన ప్ర‌స్తానం అని రామ్‌చ‌ర‌ణ్ తెలిపాడు. ఆ త‌రువాత ఎంఎస్ ధోని గురించి అడుగ‌గా.. కామ్ అండ్ కూల్ అని చెప్పాడు. రోహిత్ శ‌ర్మ గురించి అడుగ‌గా.. అంద‌రి మ‌నిషి అని అన్నాడు. విరాట్ కోహ్లీ గురించి అడుగ‌గా ఫైర్ అని స‌మాధానం ఇచ్చాడు.

Anupama Parameswaran : అందాల అనుప‌మ‌.. కొంటె చూపుల‌తో క‌వ్వింప‌కుమా.. ఫోటోలు వైర‌ల్

జ‌స్‌ప్రీత్ బుమ్రా గురించి అడుగ‌గా.. తాను అత‌డికి చాలా పెద్ద అభిమానిని అని చ‌ర‌ణ్ అన్నాడు. అత‌డిని పొగుడుతూ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ అని పొర‌బాటున అన్నాడు. ఇందుకు సంబంధించి వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దీనిపై రామ్‌చ‌ర‌ణ్ స్పందించారు. తాను కొన్ని సార్లు పేర్లు మ‌రిచిపోతుంటాన‌ని అన్నాడు. జ‌న‌సందోహం, హంగామా మ‌ధ్య అనుకోకుండా పొర‌పాటు జ‌రిగింద‌న్నాడు. బుమ్రాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఆయ‌న్ను తాను ఎంతో గౌర‌విస్తాన‌ని తెలిపాడు. ఆయ‌న ఆట‌కు తాను పెద్ద అభిమానిని అని, ఆయ‌న ఆట‌తీరు భార‌తీయుల‌ను గ‌ర్వ‌ప‌డేలా చేస్తుంద‌న్నారు.

Ananya nagalla : ఆరెంజ్ డ్రెస్ లో అనన్య అందాలు..