ChaySam BreakUP: చైతూ సమంత బ్రేకప్.. హీరో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్!
సమంత, నాగ చైతన్య బ్రేకప్ చెప్పేసుకుని, ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత హీరో సిద్ధార్థ్ వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
- vamsi
- Updated on- October 2, 2021 / 09:48 PM IST
Siddharth
ChaySam BreakUP: సమంత, నాగ చైతన్య బ్రేకప్ చెప్పేసుకుని, ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత హీరో సిద్ధార్థ్ వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
పాఠశాలలో టీచర్ నుంచి నేను నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి. “మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు.” మీది? అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్‌ని సపోర్ట్ చేస్తూ హీరోయిన్ పూనమ్ కౌర్ “ఇది నిజం” అంటూ రీట్వీట్ చేసింది.
అంతకుముందు ట్వీట్లో హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు వెల్లడించాడు. ‘మహా సముంద్రం’ మూవీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా సిద్దార్థ్ గాయపడ్డారు. ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్ వెన్నుముకకు గాయమైంది.
దీంతో సర్జరీ కోసం లండన్ వెళ్లిన సిద్దార్థ్ తిరగి ఇండియా వచ్చారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. తాను ఇండియాకు తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.
