Hero Simbu : అందుకే మద్యం మానేశా.. రివీల్ చేసిన శింబు!

చాలామంది డిప్రెషన్‌తో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ని నాశనం చేసుకున్నవారు ఉన్నారు. మద్యంతో తమ జీవితం నాశనం అవుతుందని గ్రహించి తొందరగా అందులో నుంచి బయటపడినవారు లేకపోలేదు.

Hero Simbu Reveals He Quit Alcohol Year Ago

hero simbu reveals quit alcohol year ago :  మద్యానికి బానిసై అనారోగ్యానికి గురైనవారు ఎందరో ఉన్నారు. అందులో హీరో, హీరోయిన్లు కూడా ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. చాలామంది డిప్రెషన్‌తో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ని నాశనం చేసుకున్నవారు ఉన్నారు. మద్యంతో తమ జీవితం నాశనం అవుతుందని గ్రహించి తొందరగా అందులో నుంచి బయటపడినవారు లేకపోలేదు.

ఆ జాబితాలోకి మరో హీరో కూడా చేరారు. అతడే కోలీవుడ్‌ హీరో శింబు.. ప్రస్తుతం శింబు ‘మానాడు’ అనే మూవీలో నటిస్తున్నాడు.  యాక‌్షన్‌ కథాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఇటీవల కరోనా కారణంగా మూవీ వాయిదా పడింది.

ఈ మూవీలోని ఓ పాటను ట్విట్టర్‌ వేదికగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శింబు, డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు, హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శి నటీనటులు ఉన్నారు. ఈ సందర్భంగా శింబును ఒక ప్రశ్నఅడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా తాను ఏడాది క్రితమే మద్యం మానేసినట్లు శింబు రివీల్ చేశాడు. మద్యం మానేయడం వల్ల ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు.