Srivishnu: ఒకేసారి నాలుగు సినిమాలు.. లిస్ట్ లో క్రేజీ డైరెక్టర్స్.. ఇదేం స్పీడ్ భయ్యా!

సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్న హీరో శ్రీవిష్ణు(SriVishnu).

Hero SriVishnu doing four exciting films in a row.

  • వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు
  • ఒకేసారి ఏకంగా నాలుగు సినిమాలు
  • సితార బ్యానర్ లో కూడా ఒకటి

Srivishnu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే, విష్ణు విన్యాసం, మృత్యుంజయ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఏకంగా నాలుగు సినిమాలు ఉండటం విశేషం. ఈ నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

Paramapada Sopanam Review: అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ సినిమా రివ్యూ.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

మరోవైపు, శ్రీవిష్ణు(Srivishnu) కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ‘సామజవరగమన’ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఆయన మళ్లీ జతకట్టడం విశేషం. ఈ కాంబినేషన్లో రాబోతున్న హిలేరియస్ కామెడీ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే నెలకొన్నాయి. వీటితో పాటు భాను భోగవరపుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. అలాగే, రంగబలి ఫేమ్ పవన్ బసంశెట్టి దర్శకత్వంలో రూపొందనున్న విభిన్న కథా చిత్రం శ్రీవిష్ణు మార్కెట్‌ను పెంచేలా కనిపిస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూనే, తనదైన శైలిలో వినోదాన్ని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

అయితే, వరుసగా సినిమాలు చేయడం కంటే కథల నాణ్యతపై దృష్టి పెట్టాలని ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులు సూచిస్తున్నారు. గత చిత్రాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని, స్క్రిప్ట్ ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. శ్రీవిష్ణుకి ఉన్న ప్రధాన బలం ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ. వీటిని సరిగ్గా వాడుకుంటూనే, రొటీన్ ఫార్ములాకు భిన్నంగా కొత్తదనం ఉండేలా చూసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ రాబోయే సినిమాలు శ్రీవిష్ణు కెరీర్‌ను మళ్ళీ విజయాల బాటలో నిలబెడతాయని అందరూ ఆశిస్తున్నారు.