hero trigun akarshitha movie opening ceremony
Akarshitha; టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, పదినే కుమార్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకర్షిత(Akarshitha)’. లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సూరిశెట్టి కిషోర్ తెరకెక్కిస్తుండగా.. రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం (ఫిబ్రవరి 21) ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణు స్వామి, ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియాతో సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కొత్త దర్శకుడు కిషోర్ మంచి కథతో సినిమాని తీస్తున్నారు. ఈ మూవీని సందీప్, శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. వీరందరికీ ఇది మొదటి చిత్రం. మంచి సినిమాతో మేమంతా రాబోతోన్నాం. మా కోసం వచ్చిన సి. కళ్యాణ్ గారికి, వంశీ నందిపాటి గారికి, వేణు స్వామి గారికి, దాము గారికి థాంక్స్. ఈ చిత్రంలో నేను హీరోని కాదు కసిరెడ్డి హీరో. కసిరెడ్డితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో మాతో పాటుగా రవి వర్మ గారు, రఘు గారు, ప్రియా గారు నటిస్తున్నారు. ఈ రోజు మేం మా ‘ఆకర్షిత’ టైటిల్‌ను రివీల్ చేశాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర అప్డేట్లు త్వరలోనే ఇస్తామ’ని అన్నారు.
Boyapati Srinu: బోయపాటికి ఫుల్ డిమాండ్.. వైరల్ కుర్రోడు సెట్ చేసుకున్నాడట
కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ఆకర్షిత కథను రెండేళ్ల క్రితం విన్నాను. కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. త్రిగుణ్‌తో ఇది నాకు తొలి చిత్రం. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు సూరిశెట్టి కిషోర్ మాట్లాడుతూ .. ‘మా ‘ఆకర్షిత’ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. సీతమ్మని తీసుకు రావడానికి రాముడికి వారధి అవసరమైంది. మా సినిమాని జనాల వరకు తీసుకెళ్లడానికి మీడియా వారధిలా మాకు సపోర్ట్ చేస్తోంది. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్’ అని అన్నారు.
ఇక నిర్మాత సందీప్ యాదవ్ మాట్లాడుతూ .. ‘మా ‘ఆకర్షిత’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన మీడియా వారికి థాంక్స్. మున్ముందు మా సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటిస్తామ’ని అన్నారు.