Sushanth: సిల్వర్ స్క్రీన్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో డిజిటల్ స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. థియేటర్ రిలీజ్ కు మించి ప్రేక్షకులు ఓటీటీకి జైకోడుతున్న ఈ కాలంలో వెబ్ సిరీస్ కు భారీ డిమాండ్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా దున్నేస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ లు. అందుకే బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు బడా స్టార్లు సైతం ఇక్కడ అవకాశం వస్తే వదులుకోవడం లేదు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒకవైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లపై కూడా ఓ కన్నేసి ఉంచగా టాలీవుడ్ కూడా ఒక్కొక్కరు అదే బాటలో వెళ్తున్నారు.
Sushanth : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..
అక్కినేని కుటుంబం నుండి వారసుడిగానే ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చాలా సినిమాలు చేసినా స్టార్ డమ్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. దీంతో ఈ మధ్య హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే స్టార్ హీరోల సినిమాలలో పాత్రలకు కూడా ఒకే చెప్తున్న సుశాంత్ ఇప్పుడు డిజిటల్ బాటపట్టి వెబ్ సిరీస్ కు ఒకే చెప్పాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సుశాంత్ తో ఓ వెబ్ సిరీస్ కు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.
Anveshi Jain : ‘రామారావు’తో రచ్చ రంబోలా..
లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సుశాంత్ పాల్గొనగా జీ5 టీం గ్రాండ్ వెల్ కమ్ చెపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా.. ఇందులో సుశాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ జీప్ ముందు మఫ్టీలో కూల్ గా నిల్చొని చూస్తున్న సుశాంత్ ఫోటో ఒకటి జీ5 రిలీజ్ చేసింది. సుశాంత్ ఇప్పటి వరకు పోలీస్ పాత్రలో నటించలేదు. దీంతో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. కాగా శుక్రవారం సుశాంత్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు జీ5 ప్రకటించింది.
Here's wishing the super cool, talented @iamSushanthA a very Happy Birthday! ??
Welcome to #ZEE5 family, ? we are very excited to have you on-board.? #SomethingAmazing #ComingSoon#HappyBirthdaySushanth #HBDSushanth pic.twitter.com/vdSxvEhZVQ
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2022