Akshara Gowda : పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్.. బిడ్డ ఫొటోలు షేర్ చేస్తూ..

ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ తాజాగా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.

Heroine Akshara Gowda recently shared cute photos of her baby

Akshara Gowda : ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ తాజాగా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. అయితే తనకి పుట్టింది పాపో, బాబో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ భామ. తన బిడ్డ ఫోటోలను షేర్ చేసి 9 నెలల ఆ అద్భుతమైన రోజులను గుర్తుచేసుకుంది.” తల్లి డ్యూటీ చేస్తూ.. ఎన్నో కోరికలను కోరుతూ 2024వ సంవత్సరాన్ని ముగిస్తున్నాము. తనకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను. 9 నెలలు నా కడుపులో మోసి.. అచ్చం తనలాగే ఉండే ఒక బేబీ ని గిఫ్ట్ గా ఇచ్చాను” అని ఆ పోస్ట్ లో పేర్కొంది. తన భర్తను ఉద్దేశిస్తూ ఈ కామెంట్ పెట్టింది.

Also Read : Dil Raju : టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి తెలంగాణ సర్కార్ కీలక పదవి..

దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంత ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టినప్పటికీ తనకి పుట్టింది ఎవరన్నది క్లారిటీ ఇవ్వకపోవడంతో పుట్టింది పాపా , బాబా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించింది. మొదట తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.


గతకొంత కాలం నుండి వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో నేను నా, మాస్ కా దమ్కీ, హరోం హర సినిమాల్లో నటించింది. సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్ కూడా చేసింది. అలా సినీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.