Sreeleela : సినిమాలో అవి చేయడానికి ఇంకా టైం ఉంది అంటున్న శ్రీలీల

'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంలో శ్రీలీల కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Sreeleela

Sreeleela : నందమూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తున్న’భగవంత్ కేసరి’ అక్టోబర్ 19 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సినిమాలో శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలీల కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Sreeleela : విజ్జిపాపగా శ్రీలీల లుక్స్ అదుర్స్.. భగవంత్ కేసరి ప్రెస్ మీట్‌లో..

బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19 న రిలీజ్ కాబోతోంది. కాజల్ హీరోయిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీ రోల్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా బిజీగా ఉంది. శ్రీలీల సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను పంచుకుంటున్నారు.

భగవంత్ సింగ్ కేసరిలో బాల‌కృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిగ్ స్టార్స్ పక్కన హీరోయిన్‌గా చేస్తున్న శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో కూతురి పాత్రలో నటించడానికి కారణం కథ చాలా నచ్చిందట. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయని.. ఎమోషనల్ సబ్జెక్ట్ లో నటించే అవకాశం ఎక్కువగా రాదని శ్రీలీల చెప్పారు. శ్రీలీల అంటే కేవలం డ్యాన్స్, గ్లామర్ పాత్రలు అనే ముద్ర కాకుండా మంచి నటిగా తను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారామె.

Sreeleela : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. శ్రీలీల అనిల్‌ని ఏమని పిలుస్తుందో తెలుసా?

ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చినా ఇప్పట్లో చేసేది లేదని స్పష్టం చేసారు శ్రీలీల. కొంతకాలం పాటు సెంటిమెంట్, ఎమోషన్ ఉన్న మంచి పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారామె. భగవంత్ కేసరి సినిమా కోసం నటనలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నానని శ్రీలీల చెప్పారు. ఓ వైపు మెడిసిన్ చదువుతూ మరోవైపు హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. విజ్జిపాపగా భగవంత్ కేసరిలో శ్రీలీల పెర్ఫార్మెన్స్ చూడాలంటే అక్టోబర్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే.