×
Ad

The Kerala Story 2: రిలీజ్ కు లైన్ క్లియర్.. కేరళ స్టోరీ-2 సినిమాపై స్టే ఎత్తేసిన హైకోర్టు

ది కేరళ స్టోరీ-2(The Kerala Story 2) సినిమా రిలీజ్ పై విధించిన స్టే ఎత్తివేసిన కేరళ హైకోర్టు.

Kerala High Court lifts stay on The Kerala Story-2 movie

The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ ఎంత సంచనలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ రాష్ట్రాన్ని తప్పుగా చూపించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ మండిపడ్డాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టుకెక్కిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ది కేరళ స్టోరీ 2 సినిమాపై సింగిల్ బెంచ్ జడ్జి సినిమా విడుదలపై 15 రోజుల తాత్కాలిక స్టే విధించింది. అయితే, ఈ రోజు(ఫిబ్రవరి 27) కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతిని ఇచ్చింది.

Vijay- Sangeetha: విజయ్ పెళ్లికి, శుభాకాంక్షలు సినిమాకి ఉన్న లింక్ తెలుసా?.. అభిమాని భార్యగా!

దీంతో, చిత్ర నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ది కేరళ స్టోరీ 2(The Kerala Story 2) సినిమా ఈ రోజు రాత్రి విడుదల అవుతుందని ప్రకటించారు. ఇక, నిన్న(ఫిబ్రవరి ) సినిమా విడుదలపై సింగిల్ జడ్జి స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా అప్పీలు దాఖలు చేశారు. ఆ దాఖలుపై డివిజన్ బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసిన ఒక రోజు తర్వాత కేరళ హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో, ది కేరళ స్టోరీ 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.