అమరావతి జేఏసీ ప్రకటన – చిరు ఇంటివద్ద భారీగా అభిమానులు

అమరావతి జేఏసీ చిరంజీవి ఇంటిముట్టడికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని చిరు నివాసం వద్దకు భారీగా చేరిన అభిమానులు..

  • Publish Date - February 29, 2020 / 08:12 AM IST

అమరావతి జేఏసీ చిరంజీవి ఇంటిముట్టడికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని చిరు నివాసం వద్దకు భారీగా చేరిన అభిమానులు..

శనివారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి  ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. చిరంజీవి ఇటిముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పోలీసులు చిరు ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన కారులను అడ్డుకునేందుకు ఇంటికి 100 మీటర్ల దూరంలో బారికేడ్స్ పెట్టారు.

తమ అభిమాన నటుడి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అఖిల భారత చిరంజీవి అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సారధ్యంలో చిరు ఇంటివద్ద దక్షిణాది రాష్ట్రాల మరియు తెలుగురాష్ట్రాల మెగా అభిమానులు సమావేశమయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి చిరంజీవి ఇంటిని ముట్టడించబోతుందన్న వార్తల్లో వాస్తవం లేదని అమరావతి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతి రావు స్పష్టం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి ఇంటివద్ద నిరాహార దీక్ష పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ కేవలం అమరావతి రాజధానికి మద్దతు పలకమని మర్యాదపూర్వకంగా కోరడానికి మాత్రమే.. అంటూ అమరావతి యువజన సేన కో కన్వీనర్ షేక్ జిలాని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు