×
Ad

Unstoppable with NBK : షో లోనూ ‘సింహా’న్ని చూస్తారు..

గ్లామర్‌తో పాటు గర్జనకు రెడీ అవుతున్న నటసింహం వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published On : October 18, 2021 / 05:12 PM IST

Nbk On Aha

Unstoppable with NBK: గతకొద్ది రోజులుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో నటసింహా నందమూరి బాలకృష్ణ సందడే కనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా, తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ ద్వారా ఫస్ట్ టైం డిజిటల్ ఎంట్రీ ఇస్తూ బాలయ్య టాక్ షో చెయ్యబోతున్నారనే న్యూస్ వివపరీతంగా వైరల్ అయ్యింది.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

సస్పెన్స్‌కి తెరదించుతూ ‘ఆహా’ లో నటసింహంతో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే షో చెయ్యబోతున్నట్లు లాంఛ్ ఈవెంట్‌లో స్నీక్ పీక్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు ‘ఆహా’ టీం. బాలయ్యను సరికొత్త గెటప్‌లో చూపిస్తూ.. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అంటూ డిఫరెంట్‌గా చేస్తున్న ప్రమోషన్స్‌కి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

ఆదివారం సోషల్ మీడియా ద్వారా ‘అన్‌స్టాపబుల్’ ప్రోమోస్ డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ ‘His Energy is Unmatchable and He is Unstoppable’ అనే క్యాప్షన్‌తో బాలయ్య వర్కింగ్ స్టిల్ షేర్ చేశారు. ‘సింహా’ మూవీలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే బాలయ్య క్యారెక్టర్ లాంటి కాస్ట్యూమ్స్‌లో గ్లామర్‌తో పాటు గర్జనకు రెడీ అవుతున్న నటసింహం స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.