నాని నిర్మాతగా ‘హిట్’ ప్రారంభం
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్లో రూపొందబోయే ‘హిట్’ (ది ఫస్ట్ కేస్) సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
- sekhar
- Published on- October 24, 2019 / 07:03 AM IST
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్లో రూపొందబోయే ‘హిట్’ (ది ఫస్ట్ కేస్) సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
నేచురల్ స్టార్ నాని ‘అ!’ సినిమాతో నిర్మాతగా మరాడు.. ఫస్ట్ మూవీతోనే అభిరుచి గల నిర్మాతగా ప్రత్యేకత చాటుకున్నాడు.. కొంత గ్యాప్ తర్వాత తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్లో రూపొందబోయే ప్రొడక్షన్ నెం.2 సినిమాని ప్రకటించాడు.. ఈ సినిమాకి ‘హిట్’ (ది ఫస్ట్ కేస్) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘ఈ నగరానికేమైంది’, ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాలతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్, ‘చి.ల.సౌ.’ ఫేమ్ రుహానీ శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురువారం (అక్టోబర్ 24) ‘హిట్’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విశ్వక్ సేన్, రుహానీ శర్మలపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కి నాని క్లాప్ నిచ్చారు.
Read Also : మంజు.. ఇది మంచి పద్ధతి కాదు, నిజాలు బయటపెడతా..
శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయవుతుండగా.. నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. గురువారం (అక్టోబర్ 24) నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. మ్యూజిక్ : వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ : మణికందన్, ఎడిటింగ్ : గ్యారీ, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).
