హాలీవుడ్ స్టార్ యాక్టర్ విలియం హెన్రీ డ్యూక్ టాలీవుడ్ క్రేజీ హీరో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఓ ఇంటర్‌నేషనల్ స్పై మూవీ చేయాలనే ఆలోచన ఉందని ట్వీటర్ వేదికగా చెప్పారు. గతంలో విలియం హెన్రీ ‘యాక్షన్ జాక్సన్’ (1988), ‘నెవర్ ఎగైన్’ (2001), ‘మాండీ’ (2018) సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు తనకు మహేశ్‌తో సినిమా చేయాలని ఉందంటున్నారు. వంశీ పైడిపల్లి, మహేశ్ మీరు లాస్ ఏంజిల్స్ వచ్చినప్పుడు లంచ్‌కి వస్తే, ఇంటర్‌నేషనల్ స్పై మూవీ గురించి చర్చించుకుందాం’’ అని మరో ట్వీట్ చేశారు డ్యూక్.
ఇక మహేష్ మహర్షి సినిమా విషయానికి వస్తే టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.