RC17 : RC17 కోసం హాలీవుడ్ డిజైనర్..!?
రంగస్థలంతో బిగ్ కొట్టిన తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం RC17.
- Thota Vamshi Kumar
- Published on- September 5, 2026 / 10:04 AM IST
Hollywood fasion designer will collaborate with rc17 for ramcharan
RC17 : రంగస్థలంతో బిగ్ కొట్టిన తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం RC17. అప్పట్లో చిట్టిబాబుగా చరణ్ చూపించిన నటన, సుకుమార్ మేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. ఆ సినిమాతో రామ్‌చరణ్ నటన పీక్స్‌కు వెళ్లడమే కాకుండా, ఆయన కెరీర్‌లోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది.
అందుకే ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న RC17 సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ లుక్, కాస్ట్యూమ్స్‌ను ఇప్పటివరకు టాలీవుడ్‌లో చూడని విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్రజెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ జార్జియో అర్మానీతో కొలాబరేషన్ కోసం చర్చలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇదే నిజమైతే RC17లో రామ్ చరణ్ లుక్ మరో లెవల్‌లో ఉండటం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. సుకుమార్ తన సినిమాల్లో హీరో క్యారెక్టర్, లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనే తెలిసిందే. అలాంటి సుకుమార్ విజన్‌కు అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైన్ జతైతే.. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గ్లోబల్ రేంజ్‌లో కనిపించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అర్మానీతో కొలాబరేషన్‌పై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజంగానే ఈ గ్లోబల్ కొలాబరేషన్ సెట్ అయితే మాత్రం..టాలీవుడ్‌లో ఇదొక క్రేజీ ఫ్యాషన్ మూవ్‌మెంట్‌గా మారడం ఖాయం.
