Hridayanath Mangeshkar : ఆసుపత్రిలో లతా మంగేష్కర్ సోదరుడు..
మంగేష్కర్ అల్లుడు ఆదినాథ్ మంగేష్కర్ మాట్లాడుతూ.. తన తండ్రి, లతా మంగేష్కర్ సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు హృదయ్‌నాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స.................
- Saketh U
- Published On : April 25, 2022 / 08:51 AM IST
Latha Mangeshkar (1)
Hridayanath Mangeshkar : ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆమె దహన సంస్కారాలని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. తాజాగా ఆమె పేరు మీద లతా దీనానాథ్ మంగేష్కర్ అనే అవార్డుని నెలకొల్పారు. ఈ అవార్డు కార్యక్రమం నిన్న ఆదివారం ముంబైలో జరిగింది. తొలి అవార్డుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందించారు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు.
Latha Mangeshkar : మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
లతా మంగేష్కర్ తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లతా మంగేష్కర్ అల్లుడు ఆదినాథ్ మంగేష్కర్ మాట్లాడుతూ.. తన తండ్రి, లతా మంగేష్కర్ సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు హృదయ్‌నాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో పది రోజులు హాస్పిటల్ లో ఉండాలని, ఆయన ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుందని తెలిపారు. 84 ఏళ్ల హృదయ్‌నాథ్ మంగేష్కర్ ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం.
