Hrithik Roshan : అంబానీ పార్టీలో ప్రియురాలి చెప్పులు మోసిన హృతిక్ రోషన్

హృతిక్ 2014లోనే తన భార్య సుసానే ఖాన్ కి విడాకులు ఇచ్చాడు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నా కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.

Hrithik Roshan : ఇటీవల జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) ఓపెనింగ్ కార్యక్రమానికి అనేకమంది సినీ, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్(Bollywood) స్టార్స్ అంతా వారి ఫ్యామిలీలతో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ కూడా తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) తో కలిసి వచ్చాడు. హృతిక్ 2014లోనే తన భార్య సుసానే(Sussane Khan) ఖాన్ కి విడాకులు ఇచ్చాడు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నా కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటి, సింగర్(Singer) సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.

ముంబైలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. పార్టీలకు, ఈవెంట్స్ కి కూడా హృతిక్, సబా కలిసే వెళ్తున్నారు. వీరు అధికారికంగా చెప్పకపోయినా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ అంతా అనుకుంటుంది. దీంతో హృతిక్, సబా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హృతిక్ చేసిన పని బాలీవుడ్ లో వైరల్ గా మారింది. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కి వచ్చిన ఈ జంట వేరే సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో సబా తన చెప్పులు తీసేసి ఫోటోలు దిగుతుంది. అయితే ఆ చెప్పులను హృతిక్ చేత్తో పట్టుకొని అలాగే వేరే వాళ్ళతో మాట్లాడటం, తిరగటం చేశాడు.

Vivek Ranjan Agnihotri : దసరా సినిమాతో పోలుస్తూ.. మరోసారి బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

దీంతో అంత పెద్ద పార్టీలో హృతిక్ ప్రియరాలి చెప్పులు మోశాడు అంటూ ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది అంత స్టార్ హీరో అయినా ప్రియురాలి చెప్పులు అంత పెద్ద పార్టీలో మోస్తున్నాడంటే అతనికి సబా అంటే ఎంత ఇష్టమో అని కామెంట్స్ చేస్తుంటే, కొంతమంది మాత్రం అలా పార్టీలో చెప్పులు మోయిస్తావా అంటూ సబాని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి ఈ జంట బాలీవుడ్ వార్తల్లో నిలిచింది. మరి ఈ ఘటనపై హృతిక్, సబా ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు