WAR 2 : వార్ 2 సెట్స్‌లోకి హృతిక్.. ఎన్టీఆర్ అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారు..

వార్ 2 సెట్స్‌లోకి ఈ వారం హృతిక్ రోషన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఎన్టీఆర్ ఎంట్రీ విషయానికి వస్తే..

Hrithik Roshan NTR war 2 movie shooting latest updates

WAR 2 : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘వార్ 2’. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. మొదటి షెడ్యూల్ ని ఎన్టీఆర్ అండ్ హృతిక్ లేకుండానే పూర్తి చేసుకుంది.

ఇక ఇప్పుడు హీరోలతో షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ మూవీ సెట్స్ లోకి హృతిక్ రోషన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మార్చి 7 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఆ షెడ్యూల్ లో హృతిక్ పాల్గొనబోతున్నాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ షెడ్యూల్ ని జపాన్ లో ప్లాన్ చేశారట. అక్కడ ఒక షావోలిన్ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారట.

Also read : Mahesh Babu : నా కెరీర్‌ని మలుపు తిప్పింది.. ఆ మూడు సినిమాలే..

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో ఉన్నారు. వచ్చే నెలలో కొన్ని రోజులు వార్ 2కి కేటాయించినట్లు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లోకి ఎప్పుడు అడుగుపెడతాడో చూడాలి. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తున్నాడని సమాచారం. స్పై యూనివర్స్ మొత్తానికి ఎన్టీఆర్ మెయిన్ విలన్ కాబోతున్నారట.

ప్రస్తుతం యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా ఉన్నారు. ఈ హీరోలంతా కలిసి ఎన్టీఆర్ ని ఓడించడానికే పోరాడుతూ ఉంటారని తెలుస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ 3 మూవీ ఎండింగ్ లో ఒక పవర్ విలన్ గురించి మేకర్స్ ఆడియన్స్ కి తెలియజేశారు. ఆ విలన్ ఎన్టీఆరే అని సమాచారం. కాగా ఈ మూవీ 2024 ఆగష్టు 14న రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు