Huma Qureshi : పెళ్లి చేసుకోబోతున్న మరో హీరోయిన్.. 39 ఏళ్ళ వయసులో..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషి పెళ్లి చేసుకోనుందని సమాచారం. (Huma Qureshi)
- Saketh U
- Updated on- May 5, 2026 / 07:42 AM IST
Huma Qureshi
Huma Qureshi : ఇటీవల చాలా మంది సినీ నటీనటులు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ బాటలో మరో బాలీవుడ్ భామ కూడా చేరబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషి పెళ్లి చేసుకోనుందని సమాచారం.
గ్యాంగ్స్ ఆఫ్ వస్పూర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యూమా ఖురేషి వరుసగా సినిమాలు చేసింది. మహారాణి సిరీస్ తో స్టార్ డమ్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే చేసింది హ్యూమా ఖురేషి.
Also See : Vijay : ఎన్నికల్లో గెలిచాక ఫ్యామిలీతో విజయ్ ఫొటోలు..
హ్యూమా ఖురేషి గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రచిత్ సింగ్ తో ప్రేమలో ఉంది. వీరి ప్రేమ బాలీవుడ్ లో అందరికి తెలుసు. ఇద్దరూ కలిసి అనేక బాలీవుడ్ ఈవెంట్స్ లో కనిపించారు. ఒక ఫ్రెండ్ పెళ్ళిలో పరిచయం అయిన ఈ ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టి ఇప్పుడు ప్రేమలో ఉన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ లో హ్యూమా ఖురేషి – రచిత్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ సమాచారం. చాలా మంది బాలీవుడ్ స్టార్స్ లాగే ఈ జంట కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటుందా లేదా చూడాలి.
Also Read : Vijay – Pawan Kalyan : విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ చేస్తారా?
