బెంగళూరు వీధుల్లో హీరోయిన్ ప్రణీత సమాజ సేవ

  • Publish Date - May 24, 2020 / 12:02 PM IST

COVID-19పై చేస్తున్న పోరాటం మరింత క్లిష్టంగా మారి రోజురోజుకు కేసులు పెరుగుతుంటే.. సినిమా సెలబ్రిటీలు ఎందరో మేము సైతం అంటూ బయటకు వచ్చారు. లాక్ డౌన్ సమయంలో పనిలేక ఆకలితో అలమటించే వారి కోసం హీరోయిన్ ప్రణీత ముందుకొచ్చారు. కర్ణాటక వీధుల్లో కలియ తిరుగుతూ నెలరోజులుగా ఆకలి తీరుస్తున్నారు. ఆహార పొట్లాలను పంచిపెడుతూ ఆకలితో పోరాడే వారి వైపున నిలుస్తున్నారు. 

ఇటీవల ఆటో డ్రైవర్లకు సేఫ్టీ కోసం ఆలోచించడమే కాక, హైజిన్ ప్రొడక్ట్స్ పంచిపెడుతున్నారు. దక్షిణాధి సినిమాల్లో నటించిన ఈమె బాలీవుడ్ హంగామా 2లోనూ కనిపించేందుకు సన్నాహాలు చేస్తుంది. శానిటైజర్లు, ట్రాన్సపరెంట్ షీల్డులు వారికి అందజేస్తూ సహకారం అందిస్తున్నారు. టీంతో కలిసి ఆమె చేస్తున్న పనులు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. తానే స్వయంగా కొన్ని వాహనాలకు షీల్డులు ఏర్పాటు చేస్తుంది. 

ప్రణీత దీనికి సంక్షోభానికి రిలీఫ్ గా చెప్పుకొంటూ ప్రొడక్టివ్ డే  పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలియజేసింది. లాక్ డౌన్ 4.0 సడలింపులతో ఆటోలు తిరుగుతున్నాయని వారి సేఫ్టీ కూడా ముఖ్యమేనంటూ చెప్తుంది. ప్రణీత ఇంతేకాకుండా వంట చేస్తూ.. అవసరమైన వారికి పంచిపెడుతోంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకప్, హెయిర్ స్టైల్ అసోసియేషన్ కు కూడా విరాళాలు ఇస్తూ వస్తుంది. 

ట్రెండింగ్ వార్తలు