RC17 :RC17 స్టోరీపై క్రేజీ అప్‌డేట్.. సుకుమార్ అసిస్టెంట్ హుస్సేన్ షా కిరణ్ సెన్సేషనల్ కామెంట్స్
రామ్ చరణ్ నెక్స్ట్(RC17) సినిమా కథపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సుకుమార్ అసిస్టెంట్ హుస్సేన్ షా కిరణ్.
- V Santhosh Kumar
- Published On : March 10, 2026 / 11:01 AM IST
Hussain Shah Kiran Sensational Comments on RC17 Story
- RC 17 కథ లాక్ చేసిన సుకుమార్
- రెండు వెర్షన్స్ సిద్ధం చేస్తున్న టీం
- త్వరలోనే షూటింగ్ స్టార్ట్
RC17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబోలో సినిమా రావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. దాదాపు ఏడాది క్రితమే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు.
దానికి, ఒక కారణం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటమైతే, మరోకటి సుకుమార్ ఇంకా RC17(RC17) మూవీ కథను లాక్ చేయకపోవడం. ఈ నేపధ్యంలోనే ఇటీవల సుకుమార్ అసిస్టెంట్ హుస్సేన్ షా కిరణ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. RC 17 కోసం రెండు కథలు సిద్ధం చేస్తున్నం అని చెప్పాడు.
Lavanya Tripathi Konidela: సోషల్ మీడియా వేధింపులపై లావణ్య సీరియస్.. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
దాంతో, RC17 సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతుంది అనే కామెంట్స్ వినిపించాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్టుపై మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో, మరోసారి తాను చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు హుస్సేన్ షా కిరణ్. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేను చేసిన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను రెండు కథలు రాస్తున్నాం అని చెప్పలేదు. ఒకే కథను రెండు వెర్షన్స్ రాస్తున్నట్టుగా చెప్పను. ఇప్పటికే, సుకుమార్ ఒక కథను లాక్ చేశారు.
ఆ రెండు వెర్షన్స్ లో ఏది బెస్ట్ గా అనిపిస్తే ఆ కథతోనే షూటింగ్ కి వెళ్తాము అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో, గత కొన్ని రోజులుగా RC 17పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. ఇక పెద్ది రిలీజ్ తరువాత మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
