cab Driver allegations on Mumait Khan: హాట్ బ్యూటీ, ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఐటెం స్టార్ ముమైత్ ఖాన్ తనకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిందని హైదరాబాద్‌కు చెందిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు.
తన క్యాబ్‌లో గోవా టూర్‌కు వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు మీడియాకు తెలిపాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముమైత్ ఖాన్ మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకుంది. ఆ తర్వాత టూర్‌ని మరో ఐదు రోజులు (మొత్తం ఎనిమిది) రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదట. తనలా మరో డ్రైవర్‌కు ఇలా అన్యాయం జరగకూడదని అందుకే మీడియాకు తెలియచేస్తున్నానని ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు రాజు. మరి రాజు ఆరోపణలపై ముమైత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.