Ashu Reddy Case: నటి అషు రెడ్డికి CCS పోలీసుల షాక్.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు

Ashu Reddyసోషల్ మీడియా సెలబ్రిటీ అషు రెడ్డి(Ashu Reddy)కి షాకిస్తూ హైదరాబాద్ CCS పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు.

Hyderabad CCS police have issued a Section 41A notice to Ashu Reddy

Ashu Reddy: సోషల్ మీడియా సెలబ్రిటీ అషు రెడ్డికి షాకిస్తూ హైదరాబాద్ CCS పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. అషు రెడ్డి(Ashu Reddy)తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక ఎన్నారై (NRI) యువకుడిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ.10.5 కోట్ల రూపాయల మేర మోసం చేశారనే ఆరోపణలపై బాధితుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ క్రిమినల్ కేసు నమోదైంది. ఈ భారీ కుంభకోణం, మోసం వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది.

* యాంకర్ శివజ్యోతి కూతురి నామకరణ వేడుక.. గారాల పట్టికి ఏం పేరు ఏంటో తెలుసా?

ఈ కేసుకు సంబంధించి గతంలోనే అషు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను రద్దు చేయాలని, పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో పోలీసుల విచారణ ముమ్మరమైంది. ఈ నేపథ్యంలోనే సోమవారం అషు రెడ్డి తల్లిదండ్రులు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ప్రేమ పేరిట జరిగిన ఈ కోట్ల రూపాయల వసూళ్ల వ్యవహారంలో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.