Ippudu Kaaka Inkeppudu : ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై కేసు నమోదు..

‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమా మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు..

Ippudu Kaaka Inkeppudu : ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై కేసు నమోదు..

Ippudu Kaaka Inkeppudu

Updated On : August 3, 2021 / 5:45 PM IST

Ippudu Kaaka Inkeppudu: ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువ నటీనటులు హస్వంత్ వంగ, నమ్రతా దరేకర్, వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో వై .యుగంధర్ దర్శకత్వంలో, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’..

Allu Arha : లిటిల్ ప్రిన్సెస్ సెట్లో అడుగుపెట్టింది..

రీసెంట్‌గా ఈ సినిమా మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ మూవీలోని ఓ శృంగార సన్నివేశంలో వాడిన భజగోవిందం అనే పాట పలువురి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని భావించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్..!

ప్రస్తుతం యూత్‌ని టార్గెట్ చేసి తీస్తున్న రొమాంటిక్ సినిమాల మాదిరిగానే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’.. మూవీని తెరకెక్కించారు. పోస్టర్లు వల్గారిటీగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ట్రైలర్‌లోనూ అసభ్యకరమైన సన్నివేశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.