×
Ad

Hyderabad Traffic Police : ‘అఖండ’ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బాలయ్యకి థ్యాంక్స్!

రోడ్ సేఫ్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా ‘అఖండ’ సీన్ వాడిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

  • Published On : January 23, 2022 / 02:05 PM IST

Hyderabad Traffic Police

Hyderabad Traffic Police: రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి, అందరికీ అర్థమయ్యేలా అలాగే ఆకర్షించేలా చెప్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకుగానూ వారు సినిమాల పోస్టర్లు, సన్నివేశాలు వంటివి వాడుతున్నారు.

Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..

రీసెంట్‌గా బాలయ్య-బోయపాటిల బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ లోని ఓ సన్నివేశాన్ని వాడుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ‘అఖండ’ లో ఓ సీన్‌లో బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ జిప్సీలో ట్రావెల్ చేస్తుండగా ఓ ట్రక్ అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వెయ్యగా ప్రగ్యా తల డాష్ బోర్డుకి గుద్దుకుంటుంది.

Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

దీంతో బాలయ్య ‘సీటు బెల్ట్ పెట్టుకోండి.. జీవితం చాలా విలువైనది’ అని చెప్పడంతో ఆమె సీటు బెల్ట్ పెట్టుకుంటుంది. రోడ్ సేఫ్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ సన్నివేశాన్ని సినిమాలో పెట్టినందుకు బాలయ్య, బోయపాటిలకు కృతజ్ఞతలు తెలుపుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.