Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

‘అఖండ’ గా థియేటర్లలో అసలు సిసలు మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించిన బాలయ్య.. ఓటీటీలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు..

Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

Akhanda: ‘సెంటర్ అయినా, స్టేట్ అయినా.. నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్’.. అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లజెండ్’ మూవీలో చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఇప్పుడాయనకి సరిగ్గా యాప్ట్ అయ్యిందంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.

Akhanda : 200 కోట్ల క్లబ్‌‌లో ‘అఖండ’!

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ బాక్సాఫీస్‌ని షేక్ చేసేసింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కేవలం కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్‌తో డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది ‘అఖండ’.

Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..

బాక్సాఫీస్ బరిలో అసలు సిసలు మాస్ జాతర అంటే ఏంటో చూపించింది. ‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపానికి ప్రేక్షకాభిమానులు నీరాజనాలు పట్టారు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది ‘అఖండ’. దాదాపు విడుదలైన అన్ని సెంటర్లలోనూ రూ. 1 కోటి రూపాయల గ్రాస్ మరియు షేర్ మార్క్ టచ్ చేసింది.

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

కొన్ని ఏరియాల్లో రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. అంతేకాదు, ఇటీవల కాలంలో కనుమరుగైపోయిన 50 రోజుల పోస్టర్‌ని ‘అఖండ’ తో ప్రపంచ ప్రేక్షకులకు చూపించాడు బాలయ్య. అభిమానుల మధ్యలో 50 రోజుల సంబరాలు జరుపుకుంది ‘అఖండ’ టీం.

Balakrishna : బాలయ్య ‘మంగళవారం మెనూ’ మామూలుగా లేదుగా!

విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని (ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే) జనవరి 21 సాయంత్రం 6 గంటల నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా రిలీజ్ రోజు ఎంతటి హంగామా చేశారో ఆ స్థాయిలో స్క్రీన్లకు హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. పల్లెటూర్లో ఓపెన్ స్క్రీన్ ఏర్పాటు చేసి, క్రాకర్స్ కాలుస్తూ సందడి చేశారు.

Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!

ఇక ఓటీటీలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు బాలయ్య. విడుదలైన 24 గంటల్లో ఓటీటీలో 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి.. ఓటీటీ హిస్టరీలో ‘ఆల్ టైమ్ హయ్యస్ట్ వ్యూవ్డ్’ ఫిలింగా సెన్సేషనల్ రికార్డ్ నమోదు చేసింది ‘అఖండ’. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చూసినా బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి టేకింగ్, థమన్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి. త్వరలో ఇతర భాషల్లో డబ్ చేసి అప్‌లోడ్ చెయ్యబోతున్నారు మేకర్స్.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం